అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: ఆర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


