జాబ్ ట్రైనింగ్‌పై అవగాహన
ఖానాపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఒకేషనల్ విభాగంలో చదువుతున్న విద్యార్థులకు జాబ్ ట్రైనింగ్‌తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రిన్సిపాల్ ఆనందం అన్నారు. కళాశాలలో ఒకేషనల్ విద్యార్థుల జాబ్‌ట్రైనింగ్ కార్యక్రమంలో మంగళవారం మాట్లాడారు. ఒకేషనల్ విభాగంలోని అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, ఆఫీస్ అసిస్టెంట్, ఈటీ కోర్సుల విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కళాశాల ప్రారంభం నుంచి థియరీ క్లాసులకు హాజరైన విద్యార్థులకు జాబ్‌ట్రైనింగ్ ద్వారా ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ సరిత, అధ్యాపకులు శ్రీదేవి, హమీద్, నాగరాజు, జాకబ్, రఘువీర్, బాపు, సుభాష్ తదితరులు ఉన్నారు.


