ఘనంగా బిర్సాముండా జయంత్యుత్సవాలు
నిర్మల్ రూరల్: గిరిజన జాతీయ నాయకుడు బిర్సాముండా జయంత్యుత్సవాలు జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ పాఠశాలలో బిర్సాముండా చిత్రపటానికి ఏసీఎంవో శివాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు. బిర్సా ముండా జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. నవంబర్ 15 బిర్సా ముండా జయంతి సందర్భంగా 10 రోజులు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో ఉపాధ్యాయులు రమేశ్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.


