మన రోడ్లూ డేంజరే!
నిర్మల్‌టౌన్: రంగారెడ్డి జిల్లా మీర్చాగూడ వద్ద రోడ్డుపై ఉన్న ఒక గుంత కారణంగా 19 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. కంకర లోడ్‌తో వస్తు న్న టిప్పర్ గుంతను తప్పించబోయి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తర్వాత కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడింది. ఈ ఘటన సంచలనంగా మారింది. రోడ్లపై గుంతలు, వాహనాల ఓవర్‌లోడ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. ఇక మన జిల్లాలోనూ రోడ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ లోడ్ వాహనాలను పట్టించుకునేవారే లేరు.
నిర్మాణ లోపాలు..
జిల్లా కేంద్రంలో రహదారులు వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు పడ్డాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలు హానికరంగా మారాయి. అయినా మరమ్మతులు చేపట్టకపోవడం, కొత్త రోడ్లు నిర్మించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
బస్సుల్లోనూ ఓవర్ లోడ్..
ఇక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలోనే కాదు. ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నాయి. మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్నీ రెట్టింపు అయింది. గతంలో 60 నుంచి 70 శాతం ఉండే ఆక్యుపెన్సీ ఇప్పుడు 120 నుంచి 150 శాతం ఉంటుంది. అంటే 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ ఓవర్‌లోడ్ కారణంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయినా రవాణా అధికారులు, ఆర్టీసీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
జిల్లా మీదుగా రెండు హైవేలు..
జిల్లాలో రెండు హైవేలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిర్మల్ మీదుగా జగిత్యాల వరకు 61వ నంబర్ జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ఎన్‌హెచ్ 44. జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే ఈ రెండు రోడ్లే జిల్లా రవాణా వ్యవస్థకు, రాకపోకలకు ఆధారం. వీటిపైనే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్‌హెచ్–44 బైపాస్ రోడ్డుపై ఈ ఏడాది ఇప్పటికే పది ప్రమాదాలు జరిగాయి. ఎన్‌హెచ్–61 కూడా ప్రమాదాలకు నెలవుగా మారింది.
ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు..
రహదారులపై భారీ వాహనాలు ఓవర్‌లోడ్‌తో దూసుకెళ్తున్నాయి. రోడ్లు బాగా లేకపోయినా నిబంధనలకు విరద్ధుంగా ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. రహదారి నిబంధనలు, రవాణా శాఖ నియమాలు (లారీ, టిప్పర్, ట్రాక్టర్లు) పాటించటం లేదు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 10 టైర్ల లారీ , టిప్పర్లలో 28 టన్నులకు మించి బరువు తరలించకూడదు. 12 టైర్ల వాహనంలో 31 టన్నులు, 16 టైర్ల వాహనాలలో 41 టన్నుల బరువు మాత్రమే తరలించాలి. కానీ ఏ ఒక్క వాహనం కూడా ఈ నిబంధనాలను పాటించడం లేదు.
మన రోడ్లూ డేంజరే!
మన రోడ్లూ డేంజరే!


