స్వచ్ఛ రేటింగ్‌పై రీసర్వే
న్యూస్‌రీల్
నిర్మల్
9
భూ సమస్యలు వెంటనే పరిష్కరించండి
కుంటాల: భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త హసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన వారికి సత్వరమే అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, డీటీ రాకేశ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ దత్తూరాం పటేల్, సీసీ ముత్యం పాల్గొన్నారు.
లక్ష్మణచాంద: స్వచ్ఛ, హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ వసతుల వివరాలను ఫొటోలతో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాయి. జిల్లాలో మొత్తం 1,053 పాఠశాలలు వివరాలు నమోదు చేయగా, వాటిలో 14 పాఠశాలలు 5 స్టార్, 288 పాఠశాలలు 4 స్టార్ రేటింగ్ పొందాయి. ఈ 302 పాఠశాలల్లో సమర్పించిన వివరాల నిజనిర్ధారణ కోసం జిల్లా విద్యాశాఖ రీసర్వే ప్రారంభించింది.
వేగంగా రీసర్వే..
జిల్లా విద్యాధికారి భోజన్న ఆధ్వర్యంలో 48 కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు 5 స్టార్, 4 స్టార్ సాధించిన పాఠశాలల్లో ఒక్కొక్కరు 6 నుంచి 10 పాఠశాలల చొప్పున రీసర్వే చేస్తున్నారు. ఈ సర్వే అక్టోబర్ 26న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 262 పాఠశాలల్లో పూర్తయింది. మిగిలిన 40 పాఠశాలల సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని డీఈవో ఆదేశించారు.
పారదర్శకంగా..
సర్వేలో పారదర్శకత కోసం ఒక క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడిని ఇతర క్లస్టర్ పరిధిలోని పాఠశాలలకు పంపి సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో అప్‌లోడ్ చేసిన వివరాలు క్షేత్రస్థాయిలో లభించనప్పుడు ఆ వివరాలను ఆన్‌లైన్ నుంచి తొలగిస్తున్నారు. పాఠశాలలు సమర్పించిన ఆరు విభాగాలపై 60 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను ప్రతీ అంశం వారీగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం పాఠశాలలు పొందిన స్టార్ రేటింగ్ నిలుస్తుందో లేదో తుది నివేదికలో నిర్ణయించనున్నారు.
రాష్ట్రస్థాయికి ఎనిమిది పాఠశాలలు
రీసర్వే పూర్తయిన వెంటనే జిల్లా కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి సిఫారసు చేయనున్నారు. వీటిలో రూరల్ విభాగంలో మూడు ప్రాథమిక పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు, అర్బన్ విభాగంలో ఒక ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాల ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తుది ఎంపిక రాష్ట్రస్థాయిలో
జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర బృందం మళ్లీ ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. ఈ క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్ర బృందం సమర్పించే తుది నివేదిక ఆధారంగా జిల్లా నుండి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పారితోషికం అందజేయనున్నారు.
జిల్లా సమాచారం....
జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,053
5 స్టార్ 14
4 స్టార్ 288
3 స్టార్ 537
2 స్టార్ 139
1 స్టార్ 75
							స్వచ్ఛ రేటింగ్‌పై రీసర్వే
							స్వచ్ఛ రేటింగ్‌పై రీసర్వే

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
