ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
నిర్మల్‌టౌన్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిదులు డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కళాశాల యజమాన్యాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు మొత్తం నాలుగేళ్ల ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నిధులు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. నిధులు లేకుండా కళాశాలలు నడపడం సాధ్యం కావడంలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,700 కోట్ల రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈనెల 3 నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేసే వరకు కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో టీపీడీఎంఏ జిల్లా అధ్యక్షుడు నవీన్‌గౌడ్, సెక్రెటరీ అఖిలేష్‌సింగ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీహెచ్.వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, గంగాధర్, వెంకటేశ్, సునీల్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


