అడెల్లి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఖాళీగా ఉన్న రెండు ధర్మకర్తల స్థానాలకు సోమవారం ఆలయ ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. అడెల్లికి చెందిన కొత్తపల్లి అనసూయ, మామిడి నారాయణరెడ్డి ధర్మకర్త పదవికి దరఖాస్తు చేసుకోగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అబ్దుల్‌హాదీ, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, కౌట్ల(బి) పీఏసీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, దేవరకోట దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు విలాస్‌రావు, కార్యదర్శి ముత్యంరెడ్డి, కేఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
