సరిహద్దులో పటిష్ట గస్తీ
తానూరు: సరిహద్దులో అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధి కారులను ఆదేశించారు. తానూరు మండలం బెల్‌తరోడాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సోమవారం తనిఖీ చేశారు. జిల్లాలో వరి, సోయా, మొక్కజొన్న, కొనుగోళ్లు ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంటలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోకి ప్రవేశించే వాహనం తనిఖీ చేయాలని సూచించారు. తని ఖీ చేసిన వాహనాల వివరాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని చెప్పారు. కలెక్టర్ వెంట భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, డీఏవో అంజిప్రసాద్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్ ఉన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
