ఐఎంఏ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా రామకృష్ణ
నిర్మల్‌చైన్‌గేట్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నిర్మల్‌కు చెందిన డాక్టర్ యూ.రా మకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణను గజ మాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, సీనియ ర్ వైద్యులు అప్పాల చక్రధరి, రమేశ్, కృష్ణంరాజు, శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, సురేశ్, సంతోష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
