
గురువుల సాయం..
సమస్య పరిష్కారం..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఆరుబయట భోజనం చేస్తారు. జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు నేలపైనే కూర్చుని భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులంతా కలిసి విద్యార్థుల ఇబ్బంది తొలగించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత నగదు పోగుచేసి విద్యార్థులు సామూహికంగా భోజనం చేసేందుకు అనువుగా ఉండే సీటింగ్ కవర్లను కొనుగోలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో దాదాపు 250 మంది విద్యార్థులు వీటిపై కూర్చుని భోజనం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్