
కదిలి, కాల్వ ఆలయాల హుండీ లెక్కింపు
దిలావర్‌పూర్: మండలంలోని అత్యంత ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న శ్రీమాతాన్నపూర్ణ కదలి పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం అధికారులు లెక్కించారు. శ్రావణ మాసప్రత్యేక పూజల అనంతరం ఈ హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. కాల్వ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.4.25 లక్షల ఆదాయం సమకూరింది. శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయానికి హుండీ ద్వారా రూ.6.61 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కాల్వ ఆలయ కమిటీ చైర్మన్ అంగూరి మహేందర్, కదిలి ఆలయ కమిటీ చైర్మన్ నార్వాడి వెంకట్‌రావుపాటిల్, ఆలయాల ఈవో భూమయ్య, ఎండో మెంట్ సీనియర్ అసిస్టెంట్లు జాదవ్ మాధవరావుపాటిల్, మనోహర్ పాల్గొన్నారు.