
అటవీ అధికారి దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్: మండలంలోని తర్లపాడు గ్రామంలో పోడు రైతు బోసు భూమన్నకు చెందిన పంటను అటవీ అధికారులు పదేపదే ధ్వంసం చేస్తుండడంతో సీపీఎం ఆధ్వర్యంలో అటవీ అధికారి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. పట్టణంలోని జీపు అడ్డాలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నూతన్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు నాగలి నర్సయ్య, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. అధి కారులు పోడు రైతుపై కక్షసాధింపు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.