
గణపతి బప్పా మోరియా
– వివరాలు 11లోu
వినాయక పండగ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు. చిన్నారులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై సామాజిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలో శ్రీసరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు గణపతి రూపంలో విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. – భైంసాటౌన్
రావయ్యా.. గణపయ్యా..
నిర్మల్: ‘రావయ్యా.. బొజ్జగణపయ్యా.. నీరాక మాకెంతో సంతోషమయ్యా..’ అంటూ చిన్న నుంచి పెద్దదాకా జిల్లా అంతా గణనాథుడికి స్వాగతం పలుకుతోంది. వినాయకచవితికి పర్వదినంతోపాటు నవరాత్రుల వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇంట్లో చిన్ని గణపయ్య మొదలు గల్లీకా గణేశ్ దాకా ఘనంగా స్వాగతం పలికేందుకు మండపాలు, డెకరేషన్‌లు, లైటింగ్, సౌండ్‌సిస్టం.. ఇలా అన్నింటినీ సిద్ధం చేవారు. బుధవారం ఉదయం నుంచే ఏకదంతుడు కొలువుదీరి భక్తుల పూజలందుకోనున్నాడు. కొన్నేళ్లుగా ప్రకృతి పరిరక్షణలో భాగమవుతున్న జిల్లావాసులు ఈసారీ.. ‘ఎకోదంతుడి’కే జైకొడుతున్నారు. మట్టిప్రతిమలు, విగ్రహాలకు గతంతో పోలిస్తే డిమాండ్ పెరిగింది. ఒక్క నిర్మల్ పట్టణంలోనే 20కిపైగా పెద్ద మట్టిగణనాథులను ప్రతిష్టించారు. ఇక ఇళ్లల్లో దాదాపు మట్టి ప్రతిమలనే పెట్టి పూజిస్తున్నారు. పలు సంఘాలు, సామాజిక కార్యకర్తలూ మట్టి ప్రతిమలను ప్రత్యేకంగా తయారు చేయించి, పండుగ రోజు ఉచితంగా పంచుతున్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో వినాయక ఉత్సవాలను వంద ఏళ్లకు పైబడి నిర్వహిస్తూ వస్తున్నారు. బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపును జిల్లా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికీ జిల్లాలో చాలా మండపాల వద్ద తిలక్ ఫొటోనూ పెడుతుండటం గమనార్హం. సరిహద్దు మండలాలైన తానూరు, కుభీర్, భైంసాల్లో ఇప్పటికీ పలు గ్రామాలు ఆనవాయితీ ప్రకారం కర్ర గణేశులనే పూజిస్తున్నాయి.
నగదు బదిలీ డిమాండ్..
ఉచిత చేప పిల్లల నాణ్యత సరిగా లేక నష్టపోతున్నామని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నగదు బదిలీ ద్వారా నిధులను నేరుగా సంఘాల ఖాతాలకు జమ చేస్తే, తామే నాణ్యమైన సీడ్ కొనుగోలు చేసి చెరువుల్లో విడుదల చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఈ విధానం నిధుల దుర్వినియోగాన్ని నిరోధిస్తుందని వాదిస్తున్నారు. ప్రభుత్వం సంప్రదాయ టెండర్ పద్ధతినే కొనసాగిస్తోంది. దీంతో కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా అయ్యే సీడ్ నాణ్యతపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గణపతి బప్పా మోరియా