రెయిన్‌.. అలర్ట్‌! | - | Sakshi
Sakshi News home page

రెయిన్‌.. అలర్ట్‌!

Aug 18 2025 6:19 AM | Updated on Aug 18 2025 6:19 AM

రెయిన

రెయిన్‌.. అలర్ట్‌!

● జిల్లా వ్యాప్తంగా వర్షం.. ● అప్రమత్తమైన అధికార యంత్రాంగం ● కలెక్టర్‌తో మాట్లాడిన ఇన్‌చార్జి మంత్రి ● సహాయ చర్యలపై దిశానిర్దేశం సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025

న్యూస్‌రీల్‌

నిర్మల్‌
రాయ‘లేఖ’!
మంచి, చెడు సమాచారం మోసుకొచ్చేది ఉత్తరం. దానిని సరైన చిరునామాకు చేర్చేది పోస్టుమెన్‌. ప్రస్తుతం రాసేవారు కరువయ్యారు. లేఖలు కరువయ్యాయి.

నేటి ప్రజావాణి రద్దు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో మూడు రోజులుగా కు రుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు

మండలం నమోదైన వర్షపాతం

మి.మీలలో

కుభీర్‌ 82.0

తానూరు 101.2

బాసర 47.0

ముధోల్‌ 64.6

భైంసా 94.8

కుంటాల 83.2

నర్సాపూర్‌(జి) 43.8

లోకేశ్వరం 80.0

దిలావర్‌పూర్‌ 79.2

సారంగాపూర్‌ 130.2

నిర్మల్‌ 59.2

నిర్మల్‌ రూరల్‌ 45.2

సోన్‌ 61.6

లక్ష్మణచాంద 28.6

మామడ 42.4

పెంబి 58.6

ఖానాపూర్‌ 32.0

కడెం పెద్దూర్‌ 27.4

దస్తురాబాద్‌ 34.6

భైంసా: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు గా జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివా రం జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, కాలువలు పొంగుతున్నాయి. కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల వద్ద అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వరదలకు రోడ్లు కోతకు గురయ్యాయి. నదుల పరీవాహక ప్రాంత పంటలు నీటమునిగాయి. గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో

అధికారుల పర్యటన..

జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ జిల్లాలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. దస్తురాబాద్‌ మండలం బూత్కూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌తోపాటు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్‌ సందర్శించి, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో జాఫ్రాపూర్‌ సమీపంలోని వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహించింది. ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా పరిస్థితిని పరిశీలించారు. భైంసా డివిజన్‌లో సబ్‌ కలెక్టర్‌ అజ్మెర సంకేత్‌కుమార్‌ పరిస్థితిని సమీక్షించారు.

మంత్రి సమీక్ష..

జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడి, జిల్లా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని, దీంతో పంటపొలాల్లో నీరు చేరినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆదివారం గేట్లు దించడంతో వరద తగ్గిందని పేర్కొన్నారు. అయినా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

సగటు వర్షపాతం 63.3 మి.మీలు..

జిల్లాలో సగటు వర్షపాతం 63.3 మిల్లీమీటర్లుగా న మోదైంది. సారంగాపూర్‌ మండలంలో అత్యధికంగా 130.2 మిల్లీమీటర్లు, కడెం మండలంలో అత్యల్పంగా 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గోదావరి తీర గ్రామాల అప్రమత్తం

ద్విచక్రవాహనంపై వెళ్తున్న సబ్‌ కలెక్టర్‌

రెయిన్‌.. అలర్ట్‌!1
1/4

రెయిన్‌.. అలర్ట్‌!

రెయిన్‌.. అలర్ట్‌!2
2/4

రెయిన్‌.. అలర్ట్‌!

రెయిన్‌.. అలర్ట్‌!3
3/4

రెయిన్‌.. అలర్ట్‌!

రెయిన్‌.. అలర్ట్‌!4
4/4

రెయిన్‌.. అలర్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement