
గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి
దస్తురాబాద్: భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతీ గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. వైద్యసిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. విధులు నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆరోగ్యకేంద్రం వైద్యుడు నాగరాజు, హెచ్‌ఈవో కన్నయ్య, వైద్యసిబ్బంది ఉన్నారు.