
‘కడెం’కు ఇక ఢోకాలేదు
ఫలించిన ముందస్తు మరమ్మతులు 2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న ప్రాజెక్టు ఆటంకం లేకుండా పనిచేస్తున్న 18 గేట్లు
2022 జూలై 12–13: కడెం చరిత్రలో అంత్యత భారీగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చింది. ఔట్‌ఫ్లో సామర్థ్యాన్ని మించడంతో గేట్ల పైనుంచి నీరు ప్రవహించింది.
2023 జూలై 21: 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. గేట్లు మొరాయించడంతో నీటిని విడుదల చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక యువకులు మాన్యువల్‌గా గేట్లను ఎత్తారు.
2023 జూలై 27: 3.87 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో రెండు గేట్ల కౌంటర్ వెయిట్‌లు దెబ్బతినడంతో నీటిని దిగువకు విడుదల చేయడంలో సమస్యలు తలెత్తాయి.
కడెం: రాష్ట్ర ప్రభుత్వం కడెం ప్రాజెక్టు కోసం చేపట్టి న ముందస్తు చర్యలు ఫలించాయి. 2022, 2023 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదల గుర్తులు ప్రజ ల మదిలో ఇంకా తాజాగానే ఉన్నాయి. వర్షాకాలం వస్తే ప్రాజెక్టు వద్ద ఆందోళన తప్పనిసరి అయ్యేది. అయితే, గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప టేల్ చొరవతో, గత ఏడాది రూ.9.46 కోట్ల నిధులతో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతు చేశారు.
బలోపేతం అయిన ప్రాజెక్టు..
ప్రాజెక్టుకు చేపట్టిన సమగ్ర మరమ్మతుల కారణంగా, ఈ ఏడాది 2 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో వ చ్చినప్పటికీ తట్టుకుని నిలబడింది. 18 వరద గేట్ల ను ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. గతంలో అనూహ్యంగా వచ్చిన వరదలు ఆందోళన కలిగించగా, ఈ ఏడాది ఆగస్టు 15 వరకు భారీ ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురికాలేదు. శనివారం భారీ వరదలు రావడంతో గేట్ల పనితీరుపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ, అవి సమర్థవంతంగా పనిచేశాయి.
అధికారుల అప్రమత్తత..
కడెం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిరంతరం ప్రాజెక్టును సందర్శిస్తూ, అధికారులకు సూచనలు జారీ చేస్తూ అప్రమత్తం చేశారు. శనివారం భారీ ఇన్‌ఫ్లో రావచ్చని ముందస్తు సమాచారంతో ఇరిగేషన్ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా, గతంలో 698–699 అడుగులుగా నిర్వహించేవారు. అయితే, అనూహ్య వరదలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు నీటిమట్టాన్ని 690–695 అడుగులుగా నిర్వహిస్తున్నారు. వర్షాకాలం కొనసాగుతున్నందున, సెప్టెంబర్ వరకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు.
గతంలో వచ్చిన భారీ వరదలు
కడెంకు తగ్గిన వరద
కడెం: కడెం ప్రాజెక్టుకు శనివారం భారీగా వరద పోటెత్తింది. ఆదివారం వరద తగ్గుముఖం పట్టింది. రాత్రి ప్రాజెక్ట్‌కు 7,755 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 693.200 అడుగుల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో పెరిగితే వరద గేట్లు ఎత్తుతామని వెల్లడించారు.