
వరల్డ్ స్కూల్ వాలీబాల్ పోటీలకు ఎంపిక
నిర్మల్ రూరల్: మండలంలోని డ్యాంగాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అండర్–15 విభాగంలో వరల్డ్ స్కూల్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల పీడీ భూక్య రమేశ్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఆర్.విక్రమ్(10వ తరగతి), బి.కృష్ణ(9వ తరగతి), ఎ.సికిందర్(8వ తరగతి) ఈనెల 18, 19, 20 తేదీల్లో హైదరాబాదు ఇబ్రహీంపట్నంలో జరిగే వరల్డ్ స్కూల్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. విద్యార్థులను జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ, ఏసీఎంవో శివాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ అభినందించారు.