
గుండేగాం వరకు నీరు..
భైంసారూరల్: భారీ వర్షాలతో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండేగాం వంతెనను ముంచెత్తింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 10 గంటల వరకు వంతెన నీటిలో మునిగి ఉంది. అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పార్డి(బి), మర్లగొండ, మహాగాం నుంచి వస్తున్న వాహనాలను చింతల్‌బోరి మీదుగా మాటేగాం నుంచి భైంసాకు మళ్లించారు. ఉదయం 10 గంటల నుంచి నీరు క్రమేనా తగ్గుతువచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వంతెన మీదుగా రాకపోకలు పునరుద్ధరించారు.
నీట మునిగిన స్మశాన వాటిక...
గుండేగాం శ్మశానవాటిక పూర్తిగా నీట మునిగింది. ఏటా వర్షాకాలంలో గుండేగాం వంతెనతోపాటు శ్మశాన వాటిక నీటమునుగుతోంది. ఈయేడు మొదటిసారిగా వంతెన నీట మునిగింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండేగాం వైపు చొచ్చుకు వచ్చింది. శ్మశానవాటికను చుట్టుముట్టింది.

గుండేగాం వరకు నీరు..