
అన్నిరంగాల్లో అభివృద్ధి
న్యూస్‌రీల్
బడిబాటలో భాగంగా ఈ ఏడాది 2,030మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్చినట్లు రాజయ్య పేర్కొన్నారు. జిల్లాలో 20 పీఎంశ్రీ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.5 లక్షలతో ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా జిల్లాలోరూ.57.80 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిలో 1,502 ప్రసవాలు జరిగాయన్నారు. అమ్మరక్షిత ద్వారా జిల్లాలో 2,054మంది గర్భిణులకు వైద్యసేవలు, పోషణ అందించినట్లు తెలిపారు.
జిల్లాలో మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ సంక్షేమశాఖల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
త్యాగధనుల ఆశయాలు సాధిద్దాం..
జిల్లాను అభివృద్ధి చేసుకుందాం
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
జిల్లాకేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా జెండా పండుగ
నిర్మల్
7
మూడో ఆర్థిక శక్తిగా భారత్
నిర్మల్‌చైన్‌గేట్: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఆవిష్కృతమవుతుందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, గాంధీపార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా, పట్టణ నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్: బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విడిపించేందుకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన త్యాగధనులు, సమరయోధుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్య్రమని, వారి త్యాగాలను స్మరిస్తూ.. వారి ఆశయాల సాధనకు కృషి చేద్దామని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్యఅతిథి హాజరయ్యారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. జెండా వందం చేసి జాతీయగీతం ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. తర్వాత తన ప్రసంగం వినిపించారు. కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్‌అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్‌కుమార్, అడిషనల్ ఎస్పీలు రాజేశ్‌మీనా, అవినాశ్‌కుమార్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమంలో ముందు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందు ఉంటోందన్నారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జిల్లా సాధిస్తున్న ప్రగతిని వివరించారు.
‘మహాలక్ష్మి’ మొదలు..
ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల వ్యవధిలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఊళ్లు.. భూముల కోసం..
పెంబితో జాతీయస్థాయి గుర్తింపు..
శాంతిభద్రతలు, నారీశక్తి..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా పోలీసులు నారీశక్తిని చాటడం ప్రశంసనీయమన్నారు. మహిళా పోలీసులతో నారీశక్తి పేరిట గస్తీ, తనిఖీలు చేపట్టడం, శివంగి టీమ్ పేరిట ప్రత్యేక మహిళా కమెండో బృందం ఏర్పాటు, వసతిగృహ విద్యార్థినుల్లో భరోసా నింపేందుకు పోలీసు అక్క, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు గాంజా గస్తీ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
మాట్లాడుతున్న
సిరిసిల్ల రాజయ్య
విద్యార్థినుల
నృత్య ప్రదర్శన
గోదావరిలో మువ్వన్నెలు
లోకేశ్వరం: మండలంలోని ధర్మోర, గొడిసెరా, పంచగుడి తదిరత గ్రామాల మత్స్యకారులు పంచగుడి గ్రామ సమీపంలోని గోదావరినదిలో శుక్రవారం చేపల వేటకు వెళ్లారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని నదిలో తెప్పలపైనే త్రివర్ణ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో మత్స్యకారులు గంగాధర్, సాయిలు, మాడబోయి గంగాధర్, మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
భైంసాటౌన్: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా, జిల్లాలో ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదు కాలేదు. అడపాదడపా కురిసిన మోస్తరు వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలకు ప్రవాహాలు రాలేదు. అయితే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. చెరువులు కుంటలు మాత్రం నిండని పరిస్థితి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు ఽఢోకా లేకున్నా.. చెరువులు నిండాలంటే అధిక వర్షాలు కురవాల్సి ఉంది. తద్వారా వాటి కింద సాగుచేసే పంటలకు ఢోకా ఉండదు. జూన్, జూలైతోపాటు ఈనెల ఇప్పటివరకు భారీ వర్షాలు లేకున్నా.. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ సూచనలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లాలో ఇలా...
ఇప్పటివరకు కురిసిన వర్షాల ప్రకారం.. జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 601.7 మి.మీల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, 478 మి.మీల వర్షపాతం నమోదైంది. అంటే, 21 శాతం లోటు నమోదైంది. మండలాలవారీగా పరిశీలిస్తే.. 10 మండలాల్లో లోటు వర్షపాతం, మరో 10 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కుభీర్(34), బాసర(31), దిలావర్‌పూర్(33), సోన్(31), లక్ష్మణచాంద(24), పెంబి(23), ఖానాపూర్(32), కడెం(30), దస్తురాబాద్(35) మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మిగిలి న మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.
గతేడాది అధికం..
గతేడాదితో పోలిస్తే.. గతేడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 912.4 మి.మీల సాధారణ వర్షపాతానికిగాను 1103.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 21 శాతం అధికంగా వర్షం కురిసింది. మండలాలవారీగా పరిశీలిస్తే.. కుభీర్, తానూర్, ముధోల్, భైంసా,కుంటాల, నర్సాపూర్(జి), ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, బాసర(39), లోకేశ్వరం(32), దిలావర్‌పూర్(24), సారంగపూర్(20), అత్యధికంగా నిర్మల్‌లో(53), నిర్మల్‌రూరల్(28),సోన్(21), లక్ష్మణచాంద(26), మామడ(27), పెంబి(25), కడెం(36) మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
నిండుతున్న ప్రాజెక్టులు...
రెండు, మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జిల్లాలోని స్వర్ణ, కడెం ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు సైతం ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు శుక్రవారం ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7మీటర్లు కాగా, ప్రస్తుతం 358.5 మీటర్ల నీటిమట్టం ఉంది. దీంతో శుక్రవారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు సైతం పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకోనున్నాయి.
ఇంకా లోటే..!
కొత్త జెండా ఏర్పాటు చేయరా?
నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా చిరిగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా అధికారులు కొత్తది ఏర్పాటు చేయలేదు. దీని పక్కనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు దీనిని గమనించలేదు. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
ప్రాజెక్టు నుంచి దిగువకు
విడుదలవుతున్న వరద నీరు
విద్య, వైద్యంలోనూ..
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వరూపిణి నృత్య కళాక్షేత్రం విద్యార్థులు నమో నమో భారతం అనే దేశభక్తి గీతంపై నాట్యం చేశారు. విజయ హైస్కూల్ నిర్మల్, వికాస్ హైస్కూల్ బైంసా విద్యార్థులు ఇటీవల జరిగిన పహల్గాం దాడి సన్నివేశాలు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు చేసిన వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.
స్టాళ్ల ఏర్పాటు..
వేడుకల్లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, బాలశక్తి, వైద్య శాఖ, పౌరసరఫరాల శాఖ, గ్రామీణ అభివద్ధి శాఖ, వ్యవసాయ శాఖ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గురించి వివరించారు.
నిండుకుండలా గడ్డెన్నవాగు
భైంసాటౌన్: ఎగువన కురిసిన వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 1,238 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టులో నీటిమట్టం 358.10 మీటర్లకు చేరింది. 10 గంటల నుంచి ఇన్‌ఫ్లో 15,416 క్యూసెక్కుల పెరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.50 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో పశువుల కాపర్లు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లాలో సరాసరి వర్షపాతం ఇలా...
శుక్రవారం నమోదైన వర్షపాతం
3.9 మి.మీ
గతంలో నమోదైన సాధారణ వర్షపాతం
4.3 మి.మీ
లోటు వర్షపాతం 9శాతం
జూన్ 1 నుంచి ఇప్పటివరకు
సరాసరి లోటు 21 శాతం

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి

అన్నిరంగాల్లో అభివృద్ధి