
మహనీయుల ఆశయాలతో ముందుకు..
స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు
నిర్మల్‌చైన్‌గేట్: అధికారులంతా స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు.79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు నోటు పుస్తకాలు, బహుమతులు, మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోనూ కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్: దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టవ్యవస్థను కాపాడడం మన బాధ్యత అన్నారు. నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణలో ప్రతిఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలి సూచించారు. వేడుకల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఏవో యూనస్ అలీ, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, డీపీవో, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జిల్లా జడ్జి శ్రీవాణి జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్, న్యాయవాదులు రాజశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలతో ముందుకు..

మహనీయుల ఆశయాలతో ముందుకు..