
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో 78వ స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టరేట్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మరోవైపు వేడుకలను గ్రామగ్రామాన పండుగలా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించనున్నారు.
మారిన వేదిక....
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు నిర్వహించా ల్సి ఉండగా వర్షాలు పడుతున్న క్రమంలో అధికారుల ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమ వివరాలు ఇలా:
ఉదయం 9.30 గంటలకు: సిరిసిల్ల రాజయ్య చేతులమీదుగా జాతీయ పతాకావిష్కరణ
09.35: గౌరవ వందన స్వీకారం
09.37: ముఖ్య అతిథి ప్రసంగం
10 నుంచి 10.40 వరకు: సాంస్కృతిక కార్యక్రమాలు
10.40 నుంచి: ప్రశంసాపత్రాలు, బహుమతుల ప్రదానం
11.20 గంటలకు: తేనేటి విందు..