
డయల్ 100 దుర్వినియోగం చేసిన ఒకరి అరెస్ట్
నిర్మల్‌టౌన్: డయల్ 100కు పలుమార్లు కాల్‌చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసిన ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ స్థానిక బంగల్‌పేట్ మహాలక్ష్మి వా డకు చెందిన సిలీకే నరేందర్ అవసరం లేకున్నా పలుమార్లు 100కు డయల్ చేసి విధుల్లో ఉన్న పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో పాటు, ఇతర కాల్స్‌కు అంతరాయం కలిగించాడన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.