
మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
లోకేశ్వరం: గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళకు మాయమాటలు చెప్పి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించిన ఘటన గురువారం మ ధ్యాహ్నం మండలంలోని వాస్తాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వాస్తాపూ ర్ గ్రామానికి చెందిన మేకల యమునాబాయి తనకున్న రెండు ఎద్దులను మేపేందుకు గ్రామ శివారులోని అబ్ధుల్లాపూర్‌కు వెళ్లే రోడ్డు మార్గంలోకి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి తన మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని వెంబడించగా నిజామాబాద్ వైపు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితునికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.