
సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు
నిర్మల్ టౌన్: జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు పెట్టినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన ‘సైబర్ వారియర్స్‘ కు గురువారం ప్రత్యేక టీషర్టులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్నట్లు తెలిపారు. సైబర్ వారియర్స్ ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించి, సాక్ష్యాలను సేకరించి, వాటిని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగానికి అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, సైబర్‌క్రైం సీఐ ఎల్‌వీ.రమణ, అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.