
ఎన్‌సీసీతో జాతీయ సమైక్యత
నిర్మల్: జాతీయ సమైక్యతను బలోపేతం చే యడంలో ఎన్‌సీసీ సహయపడుతుందని 32 వ తెలంగాణ బెటాలియన్ ఆదిలాబాద్ క మాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ అన్నారు. నర్సాపూర్(జి)లోని ప్రభుత్వ పాఠశాలలోని ఎన్‌సీసీ బృందాన్ని గురువారం సందర్శించారు. ఎన్‌సీసీ కేడెట్లకు దిశానిర్దేశం చేశారు. మాట్లాడుతూ.. ఎన్‌సీసీ దేశ సమైక్యతను, సమగ్రతను పెంచే గొప్ప వ్యవస్థ అన్నారు. చిన్నప్పటి నుంచే దేశ సేవను అలవర్చుకునే గొప్ప అవకాశం కల్పించేది ఎన్‌సీసీ అని తెలిపారు. నేషనల్ కేడెట్ కారప్స్ విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. అ నంతరం విద్యార్థుల పరేడ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశా ల హెచ్‌ఎం పురుషోత్తం, ఎన్‌సీసీ అధికారి సాయినాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.