
22న మహాగర్జన
భైంసా: ఈనెల 22న భైంసా పట్టణంలో నిర్వహించే మహా గర్జనను విజయవంతం చేయాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ కోరారు. పట్టణంలోని పిప్రికాలనీలో అన్నాబావుసాఠె కమ్యూనిటీహాల్‌లో గురువా రం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మహాగర్జనకు ముఖ్య అతిథిగా వీహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతార ని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, బీడీ కార్మికుల పింఛన్ పెంచుతా మని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం పోరా డేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బాలేరావు నందకుమార్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయిచంద్, నాయకులు ఆనంద్, తుకారాం, దిగంబర్ మాదిగ, మహే శ్, గజ్జారాం, మారుతి, గజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.