
ఆపద సమయంలో అప్రమత్తతే ముఖ్యం
కుంటాల: ఆపద సమయంలో అప్రమత్తతతో ఉంటేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఎన్డీఆర్‌ఎఫ్ టీం కమాండర్ అమర్ ప్రతాప్‌సింగ్ సూచించారు. మండలంలోని పాత వేంకూర్ గ్రామస్తులకు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్‌లు, వరదలు వచ్చినప్పుడు రక్షణ దళాలు ప్ర జలను ఎలా రక్షిస్తారో గురువారం వివరించారు. ఆపద వచ్చినప్పుడు తమకుతాము ఎలా రక్షించుకోవాలో మాక్‌డ్రిల్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో వనజ, ఆర్‌ఐ రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి అరుణ, సిబ్బంది కుల్దీప్ సింగ్, నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.