
ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్
బాసర: ఆర్జీయూకేటీ బాసరలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రత్యేక అతిథిగా ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సానుకూల ఆలోచన పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తార్కిక ఆలోచన, సరైన నిర్ణయాలతో అధిగమించగల సామర్థ్యం ప్రతీ విద్యార్థిలో ఉందన్నారు. మీరు ఈ స్థాయికి రావడానికి చేసిన కృషి, నిబద్ధత భవిష్యత్‌లో కూడా మీ విజయాలకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ డీన్ డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాజేశ్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది, నూతన విద్యార్థులు పాల్గొన్నారు.