
సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు
కై లాస్‌నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)ల పాలకవర్గాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారంతో వీటి కాల పరిమితి ముగియగా మరో ఆరు నెలల పాటు సొసైటీ, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సొసైటీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.