కోర్టూ.. దూరం కావొద్దు..! | - | Sakshi
Sakshi News home page

కోర్టూ.. దూరం కావొద్దు..!

Aug 11 2025 7:23 AM | Updated on Aug 11 2025 7:23 AM

కోర్ట

కోర్టూ.. దూరం కావొద్దు..!

నిర్మల్‌
బాసరలో భక్తుల రద్దీ
బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.

సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

జాతీయస్థాయి

పోటీలకు ఎంపిక

లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్‌ గ్రామానికి చెందిన దెబ్బడి సురేందర్‌ జా తీయస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యా డు. ఇటీవల ఆదిలాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్‌ విభాగంలో కామారెడ్డి జిల్లా తరఫున రెండు విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. బ్యాక్‌ టెండింగ్‌లో జాతీ యస్థాయికి ఎంపికై సీనియర్‌ ట్రెడిషనల్‌ విభా గంలో రజత పతకం సాధించాడు. సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించనున్న జాతీయస్థా యి పోటీల్లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సురేందర్‌ తెలిపాడు.

నిర్మల్‌: ఇప్పటికే దూరంగా ఉన్న కలెక్టరేట్‌కు వెళ్లాలటే ఇబ్బందులు పడుతుంటే.. రానున్న రోజుల్లో కోర్టులనూ ఊరికి దూరంగా తీసుకెళ్తారన్న విషయంపై జిల్లావాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టరేట్‌ ఒకవైపు ఉంటే.. ఇక కోర్టు ఇంకోవైపు దూ రభారంగా మారుతుండటంపై బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కూడా వ్యతిరేకత వ్య క్తంచేస్తున్నారు. అందరికీ అందుబాటులో ప్రస్తుతం నిర్మల్‌లో ఉన్న కోర్టుప్రాంగణం పరిధి లోనే నూతన కోర్టులు నిర్మించాలని కోరుతున్నారు.

ఏళ్లుగా సమీపంలోనే..

జిల్లాకేంద్రంలో ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక కట్ట డంలో మొదట్లో జూనియర్‌ సివిల్‌ జడ్జి (డిస్ట్రిక్ట్‌ ము న్సిఫ్‌) న్యాయస్థానం ఉండేది. 1984లో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేసి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు అదనంగా కొత్త భవనాన్ని నిర్మించా రు. జిల్లా ఏర్పాటుతో కొత్తకోర్టుల రాకతో సమీపంలోని వివిధ శాఖల భవనాల్లో ఆయా కోర్టులు ఏ ర్పాటు చేశారు. ఇవన్నీ ప్రధాన రహదారి నుంచి న డిచి వెళ్లేంత దూరంలోనే ఉన్నాయి. బస్టాండ్‌, శివాజీచౌక్‌, ఈద్‌గాం చౌరస్తా తదితర ప్రధాన ప్రాంతాల నుంచీ దగ్గరలోనే ఉన్నాయి.

అందుబాటులో నిర్మించాలని..

ఇప్పటికే ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్‌తో ఇబ్బందులు పడుతున్నామని, ఇక కోర్టుల ప్రాంగణాన్నీ దూరభారం చేయొద్దని జిల్లావాసులు విన్నవిస్తున్నారు. దీనిపై నిర్మల్‌ బార్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత వ్యక్తంచేస్తోంది. సామాన్యులతో పాటు న్యాయవ్యవస్థలో ఉన్నవారూ మహిళా ప్రాంగణ స్థలం దూరభారంగా మారుతుందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే బా ర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి ఆ ధ్వర్యంలో న్యాయవాదులు ప్రజాప్రతినిధులు, మా జీ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు, సీనియర్‌ నాయకులను కలిసి విషయాన్ని వివరిస్తున్నారు. కోర్టుల్లో సకాలంలో హాజరు కావాల్సి ఉంటుందని, అలాగే సాయంత్రం కేసులు ఆలస్యమైతే అక్కడి నుంచి నిర్మల్‌ రావడమూ ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా కోర్టుల ప్రాంగణం నిర్మించేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కోర్టు ఉన్నచోట దాదాపు మూడున్నర ఎకరాలతో పాటు పక్కనే ఉన్న పాత ఎమ్మా ర్వో, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల స్థలాన్ని కలుపుకొ ని నిర్మాణం చేపట్టవచ్చని సూచిస్తున్నారు. లేనిపక్షంలో మంచిర్యాల రోడ్డులో ఇరిగేషన్‌శాఖకు సంబంధించి గతంలో సీడీ–4ఆఫీస్‌ ఉన్న స్థలంలోనూ నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. న్యాయమూర్తుల నివాసాలను గతంలో సోఫీనగర్‌లో కోర్టుభవనం కోసం కేటాయించిన స్థలంలో నిర్మించవచ్చని జిల్లావాసులు చెబుతున్నారు.

అందరికీ అందుబాటులో ఉండాలి

జిల్లాకేంద్రంలో నిర్మించనున్న 10 కోర్టుల కాంప్లెక్స్‌ అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నాం. ఇప్పటికే జిల్లావాసులకు కలెక్టరేట్‌ దూరభారంగా మారింది. ఇప్పుడు కోర్టులు కూడా అలా కావొద్దన్నదే మా ఉద్దేశం. ప్రజలకు దూరభారం కాకుండా అందుబాటులోనే న్యాయస్థానాలు ఉండేలా నిర్మించాలని మావంతు ప్రయత్నం చేస్తున్నాం. – అల్లూరి మల్లారెడ్డి,

నిర్మల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

13, 14లో ఆధార్‌ క్యాంపులు

నిర్మల్‌ రూరల్‌: ఈనెల 13, 14 తేదీల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థుల ఆధార్‌ నమోదుకు ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి డీఈవో పరమేశ్వర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్‌కార్డులో తప్పులుంటే సవరణకు కూడా అవకాశముందని పే ర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సి పాలిటీ పరిధిలోనూ ప్రత్యేక ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

న్యూస్‌రీల్‌

అయ్యప్ప సేవకునికి గుర్తింపు

బాసర: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అఖిలభారత అయ్యప్ప ధర్మ ప్రచార రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని స్థానిక హోటల్‌ నార్త్‌ ఇన్‌లో ఆది వారం నిర్వహించారు. సమావేశంలో బాసర గ్రామానికి చెందిన జంగం రమేశ్‌ను రాష్ట్ర ఉ పాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. రమేశ్‌ ఇప్పటికే స్టేట్‌, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా, శబరి మలైలోని నారాయణతోడులో గల అన్నదాన మందిరానికి శాశ్వత ట్రస్ట్‌ సభ్యునిగా సేవలందిస్తున్నారు. జ్ఞాన సరస్వతీ, అయ్యప్పస్వామి ఆశీస్సులతో తనకీ గౌరవం దక్కిందని ఈ సందర్భంగా రమేశ్‌ పేర్కొన్నారు. అయ్యప్పస్వామి ఆశీస్సులతో బాసర ఖ్యాతిని పెంచడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు.

కొత్త భవనం కోసం..

రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట నూతన న్యాయస్థానాల ప్రాంగణాలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోనూ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తం 10 కోర్టుల ప్రాంగణ నిర్మాణానికి గాను కనీసం ఐదెకరాలు ఉండాలని హైకోర్టు సూచించింది. జిల్లాకేంద్రంలో ప్రస్తుతం ఉన్న కోర్టు పరిధిలో సుమారు 3ఎకరాల 20గుంటల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సరిపడా స్థలం లేక పలు స్థలాల పరిశీలన చేశారు. పాత ఎమ్మార్వో, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల వద్ద సమీకృత మార్కెట్‌ కోసమంటూ కేటాయించిన స్థలాన్ని, చించోలి(బి) సమీపంలోని మహిళా ప్రాంగణం వద్ద గల స్థలాన్ని పరిశీలించారు. ఇందులో మహిళా ప్రాంగణం వద్ద గల స్థలమొక్కటే సరిపడా ఉన్నట్లు గుర్తించారు. ఇది దూరభారంగా ఉండటంతో జిల్లా ప్రజలు, న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ముత్తవ్వకు 68ఏళ్లు. తనది కుంటాల మండలం. భూసంబంధిత సమస్య ఉండటంతో తన మనుమడితో కలిసి బస్సులో నిర్మల్‌కు వచ్చింది. బస్టాండ్‌లో ఆటో మాట్లాడుకుని ఎల్ల పెల్లి శివారులోని కలెక్టరేట్‌కు చేరుకుంది. పనిపూర్తయ్యే సరికి సాయంత్రమైంది. మధ్యాహ్నం అక్కడే క్యాంటిన్‌లో రెండు సమోసలు తిన్నారు. సాయంత్రం తిరిగి వెళ్లడానికి కలెక్టరేట్‌ బయటకు రాగా, ఆటో దొరకడానికి అరగంటపైనే పట్టింది. అక్కడి నుంచి బస్టాండ్‌ చేరుకున్నారు. తన మనుమడు ఆటోడ్రైవర్‌కు డబ్బులిస్తుంటే..‘ఇదేం బిడ్డా..! మనం కుంటాలకెళ్లి అచ్చిపోయినదానికంటే, ఈడ ఊళ్లె ఉన్న ఆఫీసుకు పోయచ్చినందుకే ఎక్కువ పైసలైనై గదా..’ అని వాపోయింది. ఈ పరిస్థితి ఒక ముత్తవ్వదే కాదు. చాలామంది జిల్లావాసులు ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఇప్పటికే కలెక్టరేట్‌ దూరభారం ఇబ్బంది పడుతున్న జిల్లాప్రజలు న్యాయస్థానం అందుబాటులోనే

ఉండాలంటున్న బార్‌ అసోసియేషన్‌

ప్రజాప్రతినిధులు, నాయకులకు విజ్ఞప్తి

కోర్టూ.. దూరం కావొద్దు..! 1
1/1

కోర్టూ.. దూరం కావొద్దు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement