
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్‌తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు.