
‘రైతు’కు బీమా భరోసా
● కొత్త దరఖాస్తులకు ఆహ్వానం ● ఈ నెల 13వరకు అవకాశం
నిర్మల్‌చైన్‌గేట్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చే స్తోంది. బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తోంది. రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ పథకానికి జిల్లాలో ఇప్పటివరకు 1.15 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఏడేళ్ల వ్యవధిలో సుమారు 4వేలకు పైగా రైతులు ప్రమాదవశాత్తు మరణించగా, ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు అందించింది. జిల్లాలో ఇప్పటివరకు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించనుండగా వ్యవసాయాధికారులు రెన్యూవల్ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రైతు భ రోసా పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈసారి మరో రెండువేల మంది..!
ప్రతీ సంవత్సరం రైతు బీమా కోసం అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది దరఖాస్తుల స్వీకరణకు శని వారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి 2వేల నుంచి 3వేల మంది రైతులు కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారి నుంచి కూడా దరఖా స్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతు నామిని పేరు మార్పు చేసుకునే అవకాశ మూ కల్పించినట్లు చెబుతున్నారు.
13వరకు దరఖాస్తుల స్వీకరణ
రైతువేదికల్లో ఈ నెల 13వరకు రైతుల నుంచి రైతు బీమా పథకం దరఖాస్తులు స్వీకరించనున్నారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో వ్యవసాయాధికారులు బీమా దరఖాస్తుల సేకరణలో బిజీబిజీగా ఉండనున్నారు. దరఖాస్తు చే సుకోవాలని ఇప్పటికే ఏఈవోలు వివిధ మాధ్యమా ల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
వినియోగించుకోవాలి
రైతు బీమా పథకాన్ని అర్హులైన ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ప్రతీ రైతు నేరుగా ఏ ఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవా లి. ఈ అవకాశం వినియోగించుకోవాలి.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
2025–26 సంవత్సరానికి అర్హులైన కొత్త రైతులు రైతు బీమా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. రైతుల పాత డేటాను ఈ నెల 12లోపు అధికారులు పునరుద్ధరిస్తారు. కొత్త నమోదు గడువు 13తో ముగుస్తుంది. ఈ విషయాన్ని రైతులు గమనించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.
– అభిలాష అభినవ్, కలెక్టర్
జిల్లాలో పథకం అమలు వివరాలు
సంవత్సరం బీమా నమోదు క్లెయిమ్
సెటిల్
2018 84,454 547
2019 85,384 517
2020 90,300 702
2021 96,397 642
2022 1,02,526 634
2023 1,12,793 699
2024 1,15,906 627

‘రైతు’కు బీమా భరోసా

‘రైతు’కు బీమా భరోసా