
డీఈవోపై చర్య తీసుకోవాలి
కడెం: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్‌నాయక్‌పై డీఈవో రామారావు, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డి దాడికి యత్నించారని మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేశ్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం జనరల్ సె క్రటరీ పసుల రాజలింగం ఆరోపించారు. ఆది వారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. రాజేశ్‌నాయక్ ఇటీవలే ఎస్సీ, ఎ స్టీ ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ, సర్దుబాటు అంశంలో రిజర్వేషన్ గురించి డీఈవో కార్యాలయంలో ప్రశ్నించినందుకు డీఈవోతో పాటు ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌రెడ్డి భౌతిక దాడికి యత్నించి, కులం పేరుతో తిట్టా రని ఆరోపించారు. సమగ్ర విచారణ చేపట్టి శా ఖాపరమైన చర్యలు తీసుకోకుంటే దళిత, గిరి జన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి గంగయ్య జోసెఫ్, రాజేశ్‌నాయక్ తదితరులున్నారు.