
మొక్కజొన్న క్షేత్ర పరిశీలన
సోన్: మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రా మాల్లో నానో డీఏపీ, నానో యూరియా వినియోగించి సాగు చేస్తున్న మొక్కజొన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ ఆదివారం పరిశీ లించారు. రసాయనిక ఎరువులకు బదులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని సూ చించారు. రైతు బీమా కోసం అర్హులైన రైతులు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామి ని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. ఏవో వినోద్‌కుమార్, రై తులు నర్సారెడ్డి, భీమేశ్, వేణు, మోహన్ ఉన్నారు.