దోమలకు చెక్ పెట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: దోమల అభివృద్ధిని అడ్డుకోవాలంటే లార్వా స్థాయిలోనే చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో శుక్రవారం పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిపోయిన రంజన్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, చిప్పలు, టైర్లు, పగిలిపోయిన కుండలను తొలగించాలని సూచించారు. కూలర్లలో నీటిని వారానికి ఒకసారి పూర్తిగా తొలగించి తిరిగి నింపు కోవాలన్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు భోజారెడ్డి, ఆరోగ్య సహాయకులు పురుషోత్తం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


