సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్
● జీజీహెచ్‌లో ఘనంగా నర్సుల దినోత్సవం
నిర్మల్‌చైన్‌గేట్: సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్ అని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్‌సింగ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సేవాతపనతో నర్సులు పని చేస్తున్నారని తెలిపారు. రోగుల ప్రాణాలను కాపాడడంలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సునీల్ కుమార్ రాథోడ్, విశ్వనాథ్, గణేశ్, నర్సింగ్ సూపరింటెండెంట్ వనజ, విజయలక్ష్మి, అపర్ణ, కమలమ్మ ఆస్పత్రి సిబ్బంది, రక్త నిధి సిబ్బంది రాకేశ్ పాల్గొన్నారు.
జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో..
జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నర్సింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడంలో నర్సుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యుల్లత, నర్సింగ్ పర్యవేక్షకులు ధనలక్ష్మి , విజయలక్ష్మి, వైద్యులు, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.


