జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన మూడో సబ్ జూనియర్, జూనియర్, రెండో సీనియర్ రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లాతోపాటు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 11 బంగారు, ఆరు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించినట్లు ఖేలో ఇండియా కోచ్ జ్ఞానతేజ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, ఎం.శ్రేయాన్ కార్తికేయ, వాగ్మారే కరణ్, రాథోడ్ కృష్ణ, రూప భాదూర్, తోకల్వాడ్ అరవింద్, జాదవ్ ఆర్యన్ బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో రాంచరణ్, హర్షవర్ధన్ శర్మ, సీనియర్ విభాగంలో కొట్టె స్వరూప బంగారు పతకాలు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. వీరు మే, జూన్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.


