
అంధకారంలో ఆడిట్ ఆఫీస్
నిర్మల్ మార్కెట్ యార్డ్‌లోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో మూడు రోజులుగా అంధకారం నెలకొంది. మూడు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్‌తో సర్వీస్ వైర్ కాలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సాధారణ మరమ్మతులతో సమస్య పరిష్కరించవచ్చు. కానీ, జిల్లా ఆడిట్ అధికారి నిర్లక్ష్యంతో సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు. కరెంటు లేక కార్యాలయంలో పనిచేసే 9 మంది మూడు రోజులుగా విధులకు రావడం లేదు. అధికారి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్

అంధకారంలో ఆడిట్ ఆఫీస్

అంధకారంలో ఆడిట్ ఆఫీస్