
కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న శ్రీహరిరావు
● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నా రు. సోన్ మండలం సంగంపేట్ మాజీ సర్పంచ్ మారి విలాస్, మాజీ వార్డు సభ్యులతోపాటు దాదా పు 100 మంది శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీహరిరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి సుగుణ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రకటించారు. ఆమె విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. కా ర్యక్రమంలో సోన్ మండల నాయకులు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ మాజీ సర్పంచ్ రాజనర్సింహారెడ్డి, గంజల్, మొహినొద్దీన్, సోన్ మాజీ సర్పంచ్ సముందర్‌పెల్లి సాయన్న, అంబేకర్ ప్రసాద్, రాజేశ్వర్, కిషన్‌రెడ్డి, అజర్ పాల్గొన్నారు.