PM Narendra Modi Says Yuva Shakti Is Driving Force Of India - Sakshi
Sakshi News home page

ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దం.. యువశక్తి.. దేశ చోదక శక్తి: ప్రధాని మోదీ ఉద్ఘాటన

Jan 13 2023 8:13 AM | Updated on Jan 13 2023 9:02 AM

Yuva Shakti Is Driving Force Of India Says PM Modi - Sakshi

దేశ ఆర్థిక ప్రగతి యువతరానికి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోందని..

హుబ్బళ్లి: మన దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తి యువశక్తేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక ప్రగతి యువతరానికి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గురువారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో   రైల్వే స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బొమ్మల తయారీ నుంచి పర్యాటకం దాకా, రక్షణ నుంచి డిజిటల్‌ దాకా ఎన్నో అంశాల్లో మనదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని, వార్తల్లో నిలుస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతా ముక్తకంఠంతో అంగీకరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మన శతాబ్దం, భారతదేశ యువతకు చెందిన శతాబ్దమని పేర్కొన్నారు. చరిత్రలో ఇదొక ప్రత్యేక సందర్భమని అన్నారు. ఇప్పటి యువతరం ప్రత్యేక తరమని తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత యువతపై ఉందని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ను అత్యంత ప్రభావవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువతరం నడుం బిగించాలని సూచించారు.  

మోదీ రోడ్డు షో  
ప్రధాని మోదీ గురువారం హుబ్బళ్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు అభివాదం చేశారు. మోదీ, మోదీ.. భారత్‌మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. మోదీ వాహన శ్రేణిపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. మోదీ సైతం చేతులు ఊపుతూ ఉత్సాహంగా ప్రజలకు అభివాదం చేశారు.
  
మోదీ రోడ్డు షోలో యువకుడి కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement