Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!

Working Group Would Study On Mixing COVID Vaccines Possible - Sakshi

అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో... రెండు వేర్వేరు సంస్థలకు చెందిన టీకాలు అదించొచ్చా అనే అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్‌–19 బృందం (వర్కింగ్‌ గ్రూపు) అధ్యయనం చేయనుంది. త్వరలోనే దేశంలోకి కొత్త వ్యాక్సిన్లు వస్తున్న నేపథ్యంలో వేర్వేరు టీకాలపై దేశంలో అధ్యయనం చేయనున్నట్లు వర్కింగ్‌ గ్రూపు హెడ్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు అందిస్తుండగా త్వరలోనే స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

ఈ నేపథ్యంలో రెండు డోసుల్లో రెండు వేర్వేరు టీకాలు అందిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిర్ధారణ కోసమే అధ్యయనం చేస్తున్నట్లు అరోరా పేర్కొన్నారు. జులై నాటికి స్పుత్నిక్‌ లభ్యత దేశంలో పెరగనుందని, అప్పటి నుంచి జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చుతామని తెలిపారు.

(చదవండి: NGO: శ్మశానాల్లో అధిక వసూళ్లా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top