కుప్పకూలిన లిఫ్ట్‌.. ఏడుగురు కార్మికుల మృతి..! | Workers Killed After Lift Collapses in 40 Storey Building in Thane | Sakshi
Sakshi News home page

హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో కుప్పకూలిన లిఫ్ట్‌.. ఏడుగురు కార్మికుల మృతి..!

Sep 11 2023 8:59 AM | Updated on Sep 11 2023 10:01 AM

Workers Killed After Lift Collapses in 40 Storey Building in Thane - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్‌అపార్ట్‌మెంట్‌లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్‌ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్‌లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్‌ టెర్రస్‌పై వాటర్‌ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు  5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్‌ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్‌(32), రూపేష్‌ కుమార్‌ దాస్‌(21), హరున్‌ షేక్‌(47), మిత్లేష్‌(35), కారిదాస్‌(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. 

ప్రమాదంపై  థానే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌ అధికారి యాసిన్‌ తాడ్వి మాట్లాడుతూ..  ఇది నిర్మాణ లిఫ్ట్ అని,  సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్‌ గ్రౌండ్‌ థర్డ్‌ లెవల్‌ పార్కింగ్‌ ఏరియాలో పార్కింగ్ ఏరియా)  వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. 
చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ వస్తుంది...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement