lift collapse
-
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. మృతులను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గత నెల సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. కాగా, మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది. -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
కుప్పకూలిన లిఫ్ట్.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు
భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిప్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొన్ని అడుగుల కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలు.. కమల్ నాథ్ ఆదివారం ఇండోర్‌లోని డీఎన్ఎస్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు ఆయనతో పాటు జితు పట్వారీ, సజ్జన్ సింగ్ వర్మ, విశాల్ పటేల్, వినయ్ బకాలివాల్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా ఆస్పత్రిలోని లిఫ్ట్ ఎక్కారు. కాసేపటికే లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయింది. దాంతో లిఫ్ట్ డోర్స్ జామ్ అయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. వారిని బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఇక ప్రమాదంపై డీఎన్ఎస్ ఆస్పత్రి హెడ్ మాట్లాడుతూ ‘‘కమల్ నాథ్ తన బృందంతో కలిసి లిఫ్ట్ ఎక్కే సమయానికే దానిలో 10 మంది ఉన్నారు. ఆ తర్వాత కమల్ నాథ్‌తో పాటు మరి కొందరు లిఫ్ట్ ఎక్కారు. ఓవర్‌లోడ్ కావడంతో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పడిపోయింది’’ అని తెలిపారు. అనంతరం కమల్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఆంజనేయుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. హనుమంతుడి దయ నా మీద ఎప్పుడు ఉంటుంది’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివారజ్సింగ్ చౌహాన్ ఆయనకు ఫోన్ చేసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. చదవండి: ఆమె ఓ ఐటెం..! సిగ్నల్స్ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్ -
స్వాగత్ గ్రాండ్లో విరిగిన లిఫ్ట్
- ఐదుగురికి గాయాలు మేడ్చల్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధి ఏఎస్ రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ విరిగి కిందపడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన తర్వాత క్షతగాత్రులను హోటల్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్ట్ పడి మహిళ మృతి
ఎల్బీనగర్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఇంద్రప్రస్థ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులలో నిమగ్నమై ఉన్న పద్మ అనే మహిళా కూలీపై లిఫ్ట్ పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా మరొక మహిళ సాలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో భవన యజమాని, బిల్డర్ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.