ఏఎస్ రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది.
స్వాగత్ గ్రాండ్‌లో విరిగిన లిఫ్ట్
Feb 16 2017 4:29 PM | Updated on Sep 5 2017 3:53 AM
- ఐదుగురికి గాయాలు
మేడ్చల్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధి ఏఎస్ రావు నగర్ లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ విరిగి కిందపడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన తర్వాత క్షతగాత్రులను హోటల్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement