పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌..త్రుటిలో తప్పించుకున్న మహిళ: వీడియో వైరల్‌ | Woman Narrowly Escapes Kidnapping Attempt Outside Gym In Haryana | Sakshi
Sakshi News home page

Viral Video: పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌..త్రుటిలో తప్పించుకున్న మహిళ

Jan 1 2023 8:52 PM | Updated on Jan 1 2023 8:52 PM

Woman Narrowly Escapes Kidnapping Attempt Outside Gym In Haryana - Sakshi

పార్క్‌ చేసిన కారు వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సడెన్‌గా లోపలకి వెళ్లి కూర్చొని...

ఒక మహిళను కొందరూ దుండగులు పక్కాప్లాన్‌తో కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. ఐతే సదరు మహిళ అనుహ్యంగా ఆ ఘటన నుంచి త్రుటిలో బయటపడగలిగింది. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జిమ్‌ సెంటర్‌ నుంచి బయటకొచ్చిన ఒక మహిళ తన కారులో కూర్చొని ఉండగా... ఇద్దరు వ్యక్తులు ఆగి ఉన్న ఆమె కారు లోకి దూసుకుంటూ వచ్చి కారు తలుపులు మూసేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఆమెని కిడ్నాప్‌చేసేందుకు యత్నించారు.

ఐతే ఆమె ప్రతిఘటిస్తూ...అరవడంతో భయంతో ఆ వ్యక్తులు కొద్ది వ్యవధిలోనే కారు నుంచి బయటకొచ్చేశారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డ్‌ అయ్యింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీఫుటేజ్‌ని పరిశీలించి..ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి:  ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement