
వివాహమైన ఐదు నెలలకే పెళ్లింట విషాదం నెలకొంది.
శివమొగ్గ: వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5 క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.
అయితే, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కారు షెడ్‌లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నవ్యశ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.