రైలులో మహిళతో అనుచిత ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే? | Sakshi
Sakshi News home page

రైలులో మహిళతో అనుచిత ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే?

Published Sat, Nov 25 2023 7:18 PM

Woman Beats Up Man With Slippers In Train Journey - Sakshi

ఢిల్లీ: దేశంలో ఏదో ఒక​ చోట మహిళలు, యువతుల పట్ల కొందరు పొకిరీలు ఏదో ఒక చోట వేధింపులను గురి చేస్తూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చిన కొందరు మాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. అయితే, తాజాగా రైలు ప్రయాణంలో తనను వేధించిన ఓ వ్యక్తికి మహిళ తగిన బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. రైలు ప్రయాణంలో ఓ మహిళaతో మరో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తి ఆమె పక్కనే కూర్చోని మహిళను అసభ్యకరంగా తాకాడు. దీంతో, ఆ మహిళ ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే తన చెప్పుతో ఆ వ్యక్తి చెంపపై పలుసార్లు కొట్టింది. అతడి జుట్టు పట్టుకుని తలపై బాదింది. ఆవేశంలో అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ప్రైవేట్‌ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది.

దీంతో, ఆమె దాడిని తట్టుకోలేని అతడు సీటు నుంచి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ సీటు పైకి ఎక్కిన మహిళ ఆ వ్యక్తిని మరోసారి చెప్పుతో కొట్టింది. మిగతా ప్రయాణికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement