‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. పార్టీని స్థాపించిన తొలినాళ్లలో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో ఆయన మఫ్లర్ మ్యాన్‌గా పాపులర్ అవటమే అందుకు కారణం. ఎప్పుడూ మెడలో మఫ్లర్, తలపై టోపీతో కనిపించే ఆయన.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అవి లేకుండా కనిపించారు. ఈ క్రమంలో చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కేజ్రీవాల్ సర్ మీరు మఫ్లర్ ఎందుకు ధరించలేదు? అని ఓ మహిళ ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం వాతావరణం అంత చలిగా లేదు కదా అంటూ కేజ్రీవాల్ బదులిచ్చారు. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీపార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు.. మఫ్లర్ లేకుండా కేజ్రీవాల్ కనిపించటంపై ప్రశ్నలు ఎదురవటం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఓ ట్విటర్ యూజర్ మఫ్లర్ కనిపించకపోవటంపై ఆయన్ను ప్రశ్నించారు. చాలా రోజులుగా మఫ్లర్ కనిపించటం లేదని, కానీ, దానిని ప్రజలు గుర్తించటం లేదని గుర్తు చేశారు. డిసెంబర్ 4న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థి తరఫున బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే మఫ్లర్ అంశంపై ప్రశ్న ఎదురైంది.
“सर, आपने Muffler नहीं पहना?”🧣
जनता का CM @ArvindKejriwal: अभी तक उतनी ठंड नहीं आई। 😊 pic.twitter.com/2LSjN25Y69
— AAP (@AamAadmiParty) November 29, 2022
ఇదీ చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్
మరిన్ని వార్తలు