breaking news
Delhi civic polls
-
ప్రచారంలో కేజ్రీవాల్‌కు వింత ప్రశ్న.. ఆయన సమాధానమిదే..!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. పార్టీని స్థాపించిన తొలినాళ్లలో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో ఆయన మఫ్లర్ మ్యాన్‌గా పాపులర్ అవటమే అందుకు కారణం. ఎప్పుడూ మెడలో మఫ్లర్, తలపై టోపీతో కనిపించే ఆయన.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అవి లేకుండా కనిపించారు. ఈ క్రమంలో చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కేజ్రీవాల్ సర్ మీరు మఫ్లర్ ఎందుకు ధరించలేదు? అని ఓ మహిళ ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం వాతావరణం అంత చలిగా లేదు కదా అంటూ కేజ్రీవాల్ బదులిచ్చారు. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీపార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. మఫ్లర్ లేకుండా కేజ్రీవాల్ కనిపించటంపై ప్రశ్నలు ఎదురవటం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఓ ట్విటర్ యూజర్ మఫ్లర్ కనిపించకపోవటంపై ఆయన్ను ప్రశ్నించారు. చాలా రోజులుగా మఫ్లర్ కనిపించటం లేదని, కానీ, దానిని ప్రజలు గుర్తించటం లేదని గుర్తు చేశారు. డిసెంబర్ 4న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థి తరఫున బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే మఫ్లర్ అంశంపై ప్రశ్న ఎదురైంది. “सर, आपने Muffler नहीं पहना?”🧣 जनता का CM @ArvindKejriwal: अभी तक उतनी ठंड नहीं आई। 😊 pic.twitter.com/2LSjN25Y69 — AAP (@AamAadmiParty) November 29, 2022 ఇదీ చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్ -
పొరపాటు చేశాను.. సరిదిద్దుకుంటా: సీఎం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో ఢీలాపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పొరపాట్లను అంగీకరించారు. పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేయడం వల్లే ఆప్ ఓటమి చవిచూసిందని ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆప్ పరాజయం పాలైంది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్‌కు ఓటమి తప్పలేదు. ఎంసీడీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. 'గత రెండు రోజులుగా ఆప్ కార్యకర్తలు, ఓటర్లతో మాట్లాడాను. వాస్తవమేంటన్నది తేలింది. మనం కొన్ని పొరపాట్లు చేశాం. ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకోవాలి. మూలాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆషామాషీగా తీసుకోరాదు. ఓటర్లకు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాం' అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 270 సీట్లకు గాను బీజేపీ 181 గెల్చుకోగా, ఆప్ 48, కాంగ్రెస్ 30 సీట్లతో సరిపెట్టుకున్నాయి. -
ఢీల్లీ ఎన్నికకు రంగం సిద్ధం