చెన్నై: తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి, ప్రియుడితో సినిమాకు వెళ్లిందని తెలుసుకున్న ఓ భర్త కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి, ఇంట్లోనే దాచి ఉంచాడు. ఈ సంఘటన వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని రాజకల్ పంచాయతీ కూతండవర్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కూతండవర్‌నగర్‌కు చెందిన విజయకుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ధనలక్ష్మి(36). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. ధనలక్ష్మి పేర్నంబట్టులోని ఒక ఇంటిలో పని మనిషిగా పనిచేసేది.
దీంతో ధనలక్ష్మి పది రోజులకోసారి మాత్రమే తన ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య పదిరోజులకోసారి మాత్రమే ఇంటికి వస్తూండడంతో విజయకుమార్ అనుమానించాడు. ఇదలా ఉంచితే, రెండ్రోజుల క్రితం ధనలక్ష్మి తన రెండవ కుమార్తె, ప్రియుడితో కలిసి ఆంబూరులోని ఒక సినిమా చేసి ఆ తర్వాత ఆటోలో స్వగ్రామానికి వెళ్లింది. పనికెళ్తున్నట్టు చెప్పి ఆమె సినిమాకు ప్రియుడితో వెళ్లినట్లు కుమార్తె ద్వారా తెలుసుకున్న విజయకుమార్ రగిలిపోయాడు. తన కుమార్తెలు, కుమారుడిని బంధువుల ఇంటికి పంపించి, ఆ తర్వాత భార్యను నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహించిన విజయకుమార్ కత్తితో ఆమెపై దాడి చేశాడు.
చేతుల నరాలు కట్ చేసి, గొంతు కోసి ముక్కలుగా నరికాడు. ఆమె కాళ్లు, చేతులను ఒక గోనె సంచిలో కట్టి ఇంటిలోని వంటగదిలోని స్లాబుపై పెట్టాడు. రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు మంగళవారం ఉదయం నుంచి తన భార్య కనిపించడం లేదంటూ బంధువులకు చెప్పాడు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం ఉదయం విజయకుమార్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించి సమాచారం ఇవ్వడంతో మేల్‌పట్టి పోలీసులు విజయకుమార్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, నెత్తుటి మరకలు తుడిచిన గుడ్డను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


